Current Affairs Telugu Daily

ప్రభుత్వ రంగ బ్యాంకుల  35 విదేశీ శాఖలు మూసివేత 
ప్రభుత్వ రంగ బ్యాంకులు విదేశీ కార్యకలాపాల క్రమబద్ధీకరణపై దృష్టి సారించాయి. లాభసాటిగా లేని 35 శాఖలు, రిప్రజెంటేటివ్‌ కార్యాలయాలను మూసివేశాయి. స్వచ్ఛమైన, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్‌ విధానాల అమల్లో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా మొత్తం 216 విదేశీ శాఖలు, రెమిటెన్స్‌ సెంటర్లు మొదలైన వాటన్నింటినీ సమీక్షించి, క్రమబద్ధీకరించుకోవాలంటూ 2017 నవంబర్‌లో నిర్వహించిన పీఎస్‌బీ మంథన్‌లో బ్యాంకర్లు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే తాజాగా బ్యాంకులు చర్యలు  ప్రారంభించాయి.
  • 2018 జనవరి 31 నాటికి.. పీఎస్‌బీకు అనుబంధ సంస్థు, జాయింట్‌ వెంచర్లు, ప్రాతినిధ్య కార్యాలయాలు కాకుండా 165 పైచిలుకు విదేశీ శాఖలు ఉన్నాయి.
  • ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి అత్యధికంగా 52 శాఖలు ఉండగా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు 50, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 29 ఉన్నాయి. పీఎస్‌బీ శాఖలు ఎక్కువగా బ్రిటన్‌ (32), హాంకాంగ్‌.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (చెరి 13), సింగపూర్‌లో (12) ఉన్నాయి.  

views: 1134

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams