Current Affairs Telugu Daily

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో శ్రేష్ట ప్రవస్థి
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన ఆరున్నరేళ్ల బాల కవయిత్రి శ్రేష్ట ప్రవస్థి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. చేర్యాలకు చెందిన శివగారి కిరణ్‌, రజని దంపతుల కుమార్తె శ్రేష్ట ప్రవస్థి 18 నిమిషాల్లో వేమన శతకంలోని 100 పద్యాలను చూడకుండా పాడి రికార్డు సాధించింది. శ్రేష్ట ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తెలుగు మహాసభల్లో నిర్వహించిన బాలకవి సమ్మేళనంలో పాల్గొని 52 పద్యాలు పాడి అందరి మన్ననలు పొందింది. 
views: 1188Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams