Current Affairs Telugu Daily

మాజీ సైనికుకులకు  తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ సాయం పెంపు 
తెలంగాణ  రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక నిధి ద్వారా మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఇస్తున్న వివిధ రకాల ఆర్థిక సహాయాల పెంపునకు గవర్నర్‌ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర మేనేజింగ్‌ కమిటీ ఆమోదించింది. 
  • మాజీ సైనికుల పిల్లలకు విద్యా రాయితీ కింద (ఇద్దరు పిల్లలకు మాత్రమే)1 నుంచి 10వ తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీకు ఏడాదికి రూ.10వేల చొప్పున ఇస్తారు 
  • పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుకు ఏటా రూ.15 వేలు  
  • వసతిగృహంలో ఉండి చదువుతుంటే ఏటా రూ.10 వేలు అందజేస్తారు. 
  • మాజీ సైనికుల కుమార్తెలకు వివాహగ్రాంట్‌ కింద రూ.30 వేలు. మాజీ సైనిక వితంతువుల పునర్వివాహం చేసుకుంటే రూ.30 వేలు ఇవ్వనున్నారు. 
  • మాజీ సైనికుడు, అతని భార్య, పిల్లలు చనిపోయిన పక్షంలో అంత్యక్రియవేల ఖర్చులకు రూ.10 వేలు చెల్లిస్తారు. 
  • పింఛను లేని 60ఏళ్లు దాటిన మాజీ సైనికులు, 55 ఏళ్లు పైబడిన మాజీ సైనిక వితంతువులకు నెలకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం. 
  • మాజీ సైనికుడు, అతని భార్య చనిపోయిన సందర్భంలో అనాథలుగా మారిన వారి పిల్లలకు 25ఏళ్ల వయసు వరకు నెలకు రూ.2 వేల చొప్పున సాయం. 
  • పింఛను లేని మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువులకు స్వయం ఉపాధికి ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.10 వేలు ఇస్తారు. 

views: 1136

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams