Current Affairs Telugu Daily

వైట్‌హౌస్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ పదవికి హోప్‌ హిక్స్‌ రాజీనామా
అమెరికా అధ్యక్ష భవనంలో శక్తిమంతమయిన కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు హోప్‌ హిక్స్‌ 2018 మార్చి 1న ప్రకటించారు. ట్రంప్‌ విశ్వసనీయ సహాయకుల్లో హోప్‌ హిక్స్‌ ఒకరిగా ఉండేవారు. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలపై విచారణ ముమ్మరం అయిన నేపథ్యంలో ఆమె రాజీనామా చేశారు. ఈ అంశంపై ఆమె హౌస్‌ నిఘా కమిటీ ముందు ఎనిమిది గంటల పాటు వాంగ్మూలం ఇచ్చారు. తన ఉద్యోగంలో అవసరం మేరకు తప్పించుకునే మాటలు చెప్పాను తప్పించి ఎన్నికల్లో రష్యా జోక్యానికి సంబంధించిన విచారణలో ఎప్పుడూ అబద్ధాలు  చెప్పలేదని తన వాంగ్మూలంలో ఆమె పేర్కొన్నారు. హోప్‌ హిక్స్‌ ట్రంప్‌ వద్ద మూడేళ్ల పాటు వివిధ హోదాల్లో పని చేశారు. 
views: 1006

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams