Current Affairs Telugu Daily

L&T చేతికి ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణం 
210 అడుగుల భారీఎత్తుతో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అరేబియా సముద్రంలో నిర్మించే ప్రాజెక్టును ఇంజినీరింగ్‌ దిగ్గజం L&T దక్కించుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్ట్‌ వ్యయం దాదాపు రూ.2500 కోట్లు. ఇంజినీరింగ్‌, సేకరణ, నిర్మాణం(EPC) పద్ధతిలో నిర్మించడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ అంగీకార లేఖను L&Tకి అందించారు.
  • ఈ ప్రాజెక్ట్‌  రెండో దఫా బిడ్డింగ్‌లో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఆఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, L&T పోటీపడ్డాయి.
  • రెండేళ్ల కిందట జరిగిన మొదటి దఫా బిడ్డింగ్‌లో L&T రూ.3,826 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. అయితే ప్రభుత్వ అంచనా వ్యయంతో పోలిస్తే ఇది రూ.1,326 కోట్లు ఎక్కువ కావడంతో తిరస్కరణకు గురైంది.
  • అయితే రెండో దఫాలో ప్రాజెక్ట్‌ వ్యయాన్ని ప్రభుత్వం రూ.3,600 కోట్లకు అంచనాలు పెంచింది. ఇందులో రూ.1100 కోట్లకు ప్రజల నుంచి సేకరిస్తారు. దీంతో L&T ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకుందని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
L&T-Larsen & Toubro
EPC-Engineering, procurement and construction

views: 1135

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams