Current Affairs Telugu Daily

జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ సభ్యులుగా రవీంద్రబాబు 
జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌(NCLT) హైదరాబాద్‌ బెంచ్‌లో జ్యుడిషియల్‌ సభ్యులుగా నియమితులైన బిక్కి రవీంద్రబాబు 2018 మార్చి 1న బాధ్యతలు స్వీకరించారు. అహ్మదాబాద్‌ NCLT బెంచ్‌లో పనిచేస్తున్న రవీంద్రబాబు హైదరాబాద్‌కి బదిలీ అయ్యారు. గుంటూరు ఏసీ కళాశాల నుంచి 1978లో న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆయన 1979లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1987లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమితులయ్యారు. జిల్లా జడ్జిగా పలు జిల్లాల్లో న్యాయసేవలందించారు. 2016 జూన్‌లో అహ్మదాబాద్‌ NCLT జ్యుడిషియల్‌ సభ్యులుగా నియమితులయ్యారు.
NCLT-National Company Law Tribunal

views: 951

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams