Current Affairs Telugu Daily

నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథార్టీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
అవకతవకలకు పాల్పడే ఆడిటర్లపై చర్యలకు గట్టి అధికారాలతో కూడిన నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథార్టీ (NAFRA) ఏర్పాటు చేయడానికీ ప్రధాని మోడి అధ్యక్షతన 2018 మార్చి 1న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. రూ. 12,700 కోట్ల పీఎన్‌బీ కుంభకోణం సహా వివిధ కార్పొరేట్‌ కుంభకోణాల్లో ఆడిటర్ల పాత్రను కూడా దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్న నేపథ్యంలో NAFRA ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
  • ప్రస్తుతం ఆడిటర్లపై చర్యలు తీసుకునే అధికారం ఐసీఏఐకు ఉండగా NAFRA ఏర్పాటు తర్వాత ఆ అధికారాలు కొత్త సంస్థకు వస్తాయి.
  • ఆడిటింగ్‌ వృత్తికి సంబంధించి NAFRA.. స్వతంత్ర నియంత్రణ సంస్థగా వ్యవహరిస్తుందని మంత్రి జైట్లీ చెప్పారు.
  • అన్ని లిస్టెడ్‌ కంపెనీలు, పెద్దవైన అన్‌లిస్టెడ్‌ పబ్లిక్‌ కంపెనీలు NAFRA పరిధిలోకి వస్తాయి.
  • ప్రజాప్రయోజనం ఇమిడి ఉన్న కేసుల్లో ఇతర సంస్థల్లోనూ విచారణ జరపాలని ప్రభుత్వం ఈ సంస్థను కోరవచ్చు.
  • తప్పు చేసిన ఆడిటర్‌ లేదా ఆడిటింగ్‌ సంస్థను 5 సం॥ల వరకు డిబార్‌ చేసే అధికారం NAFRAకు ఉంటుంది. భారీ జరిమానాలు కూడా విధించవచ్చు.
  • ఈ సంస్థలో ఛైర్‌పర్సన్‌, ముగ్గురు పూర్తికాలపు సభ్యులు సహా 15 మంది సభ్యులుంటారు. వీరు కాక ఒక కార్యదర్శి ఉంటారు.
  • వ్యక్తులకయితే కనీస జరిమానా రూ.లక్ష ఉంటుంది. తీసుకున్న రుసుముకు ఐదింతల వరకు జరిమానా విధించవచ్చు.
  • ఆడిటింగ్‌ సంస్థకయితే కనీస జరిమానా రూ.10 లక్షలు ఉంటుంది. గరిష్టంగా తీసుకున్న రుసుముకు పదింతలు జరిమానా విధించవచ్చు. 
NAFRA-National Financial Reporting Authority

views: 957

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams