Current Affairs Telugu Daily

ఫ్యుజిటివ్‌ ఎకనమిక్‌ అఫెండర్స్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం 
బ్యాంకు రుణాలను ఎగవేయడం, రుణాలను దారి మళ్లించడం వంటి ఆర్థిక నేరాలకు పాల్పడి చట్టం నుంచి తప్పించుకోవడానికి విదేశాలకు పరారయ్యే వారి చుట్టూ ప్రభుత్వం గట్టి ఉచ్చుని సిద్ధం చేసింది. నీరవ్‌ మోదీ, విజయ్‌మాల్యాల లాంటి నిందితులపై కఠిన చర్యలకు వీలు కల్పించే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం 2018 మార్చి 1న ఆమోదం తెలిపింది. ‘ఫ్యుజిటివ్‌ ఎకనమిక్‌ అఫెండర్స్‌ బిల్లు పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు.. కుంభకోణాలకు పాల్పడి, రుణాలు ఎగవేసి పరారయిన నిందితుల అన్ని ఆస్తులను జప్తు చేయడానికి వీలు కల్పిస్తుంది.
  • బకాయిలను త్వరగా రాబట్టుకునే లక్ష్యంతో జప్తు చేసుకున్న ఆస్తులను విక్రయించుకోవడానికి ప్రతిపాదిత చట్టం అధికారాలను కల్పిస్తుంది.
  • రూ.100 కోట్లు, అంతకన్నా ఎక్కువ మొత్తం బకాయి పడి దేశం విడిచి పరారయిన ఎగవేతదారులకు ఈ ప్రతిపాదిత చట్టం వర్తిస్తుంది.
  • ఈ ప్రతిపాదిత చట్టాన్ని 2017-18 బడ్జెట్‌లో ప్రకటించారు.
  • నీరవ్‌మోదీ, మెహుల్‌ ఛోక్సిలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుని మోసం చేసి, విచారణకు సహకరించడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రక్రియను వేగవంతం చేశారు. 

views: 987

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams