Current Affairs Telugu Daily

నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో పోలవరంపై కథనాలు
పోలవరం నిర్మాణ పనులపై ప్రత్యేక కథనాలు త్వరలో నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో ప్రసారం కానున్నాయి. 2డీ, 3డీ రూపంలో 22 నిమిషాల పాటు ఈ చానల్‌ ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తుంది. పోలవరం నిర్మాణం తీరుపై ఒక పుస్తకాన్ని విడుదల చేయనుంది. డ్రోన్లు, విమానం, హెలికాప్టర్‌ను వినియోగించి ఆ చానల్‌ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించనుంది. వచ్చే మూడు నెలల్లో ఈ కార్యక్రమాలకు సంబంధించి టెలిఫిలింను రూపొందించనుంది. ఇందుకోసం రాష్ట్ర జలవనరుల శాఖ రూ.75 లక్షలు చెల్లిస్తుంది. రాష్ట్ర జలవనరుల శాఖ 2018 మార్చి 1న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
  • నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌ సహజంగా ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేయదు. ప్రాయోజిత కార్యక్రమాల రూపంలోనూ ప్రభుత్వ పథకాలను చిత్రీకరించదు. కానీ పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమ రూపకల్పనకు ముందుకొచ్చింది.

views: 1034

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams