Current Affairs Telugu Daily

కర్ణాటకలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ పార్క్‌
ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ పార్కు కర్ణాటక రాష్ట్రంలో ఆవిష్కృతమైంది. ‘శక్తి స్థల్’గా పిలిచే ఈ మెగా ప్రాజెక్టును కర్ణాటక సీఎం సిద్దరామయ్య, విద్యుత్‌ మంత్రి శివకుమార్‌ పావగడలోని తిరుమణిలో 2018 మార్చి 1న ప్రారంభించారు.
  • మారు 13 వేల ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేశారు. పార్కు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే 2 వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుంది. 
  • సోలార్‌ ప్రాజెక్టు 13 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని ఖర్చు రూ. 16500 కోట్లు.
  • ఈ ప్రాజెక్టు కోసం భూమిని రైతుల నుంచి 28 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నారు. 
  • ఇందుకుగాను ఏడాదికి ఒక్కో ఎకరానికి రూ. 21 వేల చొప్పున అద్దె చెల్లిస్తారు.
  • 2,300 మంది రైతులు ఈ ప్రాజెక్టు కోసం భూములు లీజుకిచ్చారు.

views: 1297



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams