Current Affairs Telugu Daily

తెలంగాణకు NCRB ట్రోఫీ 
టీఎస్‌ కాప్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసుల్లో సాధికారత పెంపొందించినందుకు జాతీయ నేరాల నమోదు సంస్థ (NCRB) 2017 సంవత్సరానికి గాను తెలంగాణ పోలీసులకు ట్రోపీ అందజేసింది.
  • 2018 ఫిబ్రవరి 28న చెన్నైలో జరిగిన అఖిల భారత పోలీసు డ్యూటీ మీట్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నుంచి తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తరఫున అదనపు డీజీ (శాంతిభద్రతలు) అంజనీకుమార్‌ దీన్ని అందుకున్నారు.
  • చెన్నైలో జరిగిన అఖిల భారత పోలీసు డ్యూటీమీట్‌లో తెలంగాణ పోలీసులు 2 వెండి, 7 కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
NCRB-National Crime Records Bureau

views: 1136Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams