Current Affairs Telugu Daily

5 సం॥ లోపు చిన్నారులకు  ‘బాల్‌ ఆధార్‌’ 
అప్పుడే పుట్టిన చిన్నారులు మొదలు 5 సం॥ ల లోపు పిల్లలకు ఆధార్‌ జారీని సులభతరం చేస్తూ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) నిర్ణయం తీసుకుంది. వీరికి ‘బాల్‌ ఆధార్‌’ పేరుతో నీలి రంగు కార్డులను జారీ చేయనుంది. ఆధార్‌ జారీ చేసే సమయంలో వీరి నుంచి వేలిముద్రలు, ఐరిస్‌ వంటి బయోమెట్రిక్‌ వివరాలేవీ తీసుకోబోమని పేర్కొంది. తల్లిదండ్రులు ఆధార్‌ వివరాలను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుందని తెలిపింది.
  • నీలి రంగు కార్డులో ఆధార్‌ సంఖ్య, చిన్నారుల ఫొటో, వారి చిరునామా ఉంటాయని వివరించింది.
  • అయిదేళ్ల వయసు దాటాక.. బయోమెట్రిక్‌ వివరాలు అందించి, మరో ఆధార్‌ తీసుకోవాల్సి ఉంటుందని.. 15 ఏళ్లు దాటాక మరోసారి ఆధార్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని సూచించింది.
  • చిన్నారుల ఆధార్‌ నమోదుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

views: 1121

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams