Current Affairs Telugu Daily

భారత హాకీ మాజీ కెప్టెన్‌ గుర్‌బక్షసింగ్‌ ఆత్మకథ ‘మై గోల్డెన్‌ డేస్‌’
భారత హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ కెరీర్‌ ముగియగానే దిక్కుమాలిన రాజకీయాలతో ఘోరంగా అవమానించారని భారత హాకీ మాజీ కెప్టెన్‌ గుర్‌బక్షసింగ్‌ తన ఆత్మకథ ‘మై గోల్డెన్‌ డేస్‌’లో పేర్కొన్నారు. ధ్యాన్‌చంద్‌ ఆట చూసేందుకు క్యూ కట్టిన రోజులున్నాయని, అయితే 1962లో ఆయన్నే క్యూలో నిలబెట్టిన ఘనత మన కుటిల రాజకీయాలది అని గుర్‌బక్షసింగ్‌ తన బాధని వెళ్లగక్కారు.
  • 1960 నుంచి 1970 వరకు క్రీడల వ్యవహారాలు నీచ రాజకీయాలతో మసకబారాయని, పాటియాలాలోని జాతీయ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఐఎస్‌), భారత హాకీ సమాఖ్యకు అప్పట్లో అసలు పొసిగేదే కాదన్నారు.
  • ఆ సమయంలో ధ్యాన్‌చంద్‌ ఎన్‌ఐఎస్‌ చీఫ్‌ కోచ్‌గా పని చేశారని, తన వద్ద శిక్షణ పొందిన ఆటగాళ్లు తదనంతరం అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు ఆడుతుండగా అక్కడికి వెళ్లిన ధ్యాన్‌చంద్‌ను స్టేడియంలోకి అనుమతించలేదన్నారు. అయితే ధ్యాన్‌చంద్‌ మాత్రం తన కుర్రాళ్ల ప్రదర్శన చూడాలన్న తాపత్రయంతో ప్రతీ మ్యాచ్‌ కోసం క్యూలో నిలబడి టికెట్‌ కొనుక్కొని మరీ చూశారని, ఇది అత్యంత శోచనీయమని గుర్‌బక్ష  తన ఆత్మకథలో చెప్పుకొచ్చారు.   

views: 1192

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams