Current Affairs Telugu Daily

అమరావతిలో ‘హ్యాపీ సిటీస్‌’ సమ్మిట్‌
దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు తరహాలో అమరావతిలో ప్రతీ ఏడాది భారీ సమ్మిట్‌ను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. 2018 ఏప్రిల్‌ 10 నుంచి 12 వరకు నిర్వహించే ఈ సదస్సుకు ‘హ్యాపీ సిటీస్‌ సమ్మిట్‌ అమరావతి-2018’ పేరును ఖరారు చేశారు.
  • ఈ సమ్మిట్‌లో సిటిజన్‌-సెంట్రిక్‌ గవర్నెన్స్‌, లివబుల్‌ కమ్యూనిటీస్‌, క్లీన్‌ అండ్‌ హెల్త్‌, పర్యావరణం, బలమైన ఆర్థిక వ్యవస్థపై ప్రధానంగా చర్చించనున్నారు.
  • భారతీయ పారిశ్రామిక సమాఖ్య, రాక్‌ఫీర్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈవెంట్‌ను నిర్వహించాని నిర్ణయించారు.
  • సదస్సు నిర్వహణ కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్‌ నిర్వహణలో మార్గదర్శనం చేసేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో పలువురు మంత్రులతో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు.
  • మంత్రి నారాయణ నేతృత్వంలో పలువురు అధికారుతో వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు.
  • సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ)కార్యదర్శి నేతృత్వంలో పలువురు అధికారుతో ప్రొటోకాల్‌ కమిటీని, శాంతి భద్రతల అదనపు డీజీతో నేతృత్వంలో సెక్యూరిటీ కమిటీ, సిటీ బ్యూటిఫికేషన్‌ కమిటీ, సాంస్కృతిక కమిటీ, మీడియా కమిటీ, ఎగ్జిబిషన్‌ కమిటీ, కృష్ణా రివర్‌ వాటర్‌ లాజిస్టిక్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు.  

views: 1081

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams