Current Affairs Telugu Daily

తెలంగాణ రాష్ట్ర రైతు సమితి అధ్యక్షునిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రైతు సమితి అధ్యక్షునిగా నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమించనున్నట్లు సీఎం కేసీఆర్‌ 2018 ఫిబ్రవరి 25న ప్రకటించారు. ఆయన రైతు బిడ్డ అని, బ్రహ్మాండమైన డెయిరీని నిర్వహించారని పేర్కొన్నారు. వార్డు మెంబర్‌గా మొదలైన గుత్తా ప్రస్థానం రాష్ట్ర సమన్వయ సమితి అధ్యక్షుడి స్థాయికి చేరింది.
  • 1954లో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన ఆయన నానక్‌రామ్‌ భగవాన్‌దాస్‌ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతుండగా(1971-72) విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
  • 1978లో ఇందిరా కాంగ్రెస్‌ పార్టీలో చేరి 1981లో ఉరుమడ్ల గ్రామ పంచాయతీ వార్డు మెంబర్‌గా గెలుపొందారు. యువజన కాంగ్రెస్‌, జిల్లా కిసాన్‌ యూత్‌ సెల్‌ అధ్యక్షుడిగా రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
  • 1983లో ఆవిర్భవించిన టీడీపీలో చేరి పార్టీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా, క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పని చేశారు. 1984లో చిట్యాల మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌గా, 1985లో చైర్మన్‌గా, 1992లో సింగిల్‌ విండో డైరెక్టర్‌గా, 1992-99 కాలంలో ఉరుమడ్ల పాల ఉత్పత్తిదారుల సొసైటీ చైర్మన్‌గా పనిచేయడమే కాకుండా 1992లో నార్మాక్స్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
  • 1995లో దేవరకొండ జడ్పీటీసీగా ఎన్నికై అదే సంవత్సరం డెయిరీ డెవలప్‌మెంట్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌గా కూడా పని చేశారు.
  • 1998లో నేషనల్‌ డెయిరీ డెవలప్ మెంట్‌ బోర్డు డైరెక్టర్‌గా, 1999లో టీడీపీ తరఫున నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా మొట్టమొదటిసారి ఎన్నికయ్యారు.
  • 2009, 2014లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.
  • ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో చేరి రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

views: 1092

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams