Current Affairs Telugu Daily

సినీనటి శ్రీదేవి మృతి
ప్రముఖ సినీనటి శ్రీదేవి(54) 2018 ఫిబ్రవరి 25న దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందారు. తన మేనల్లుడు మోహిత్‌ మార్వా వివాహం కోసం భర్త బోనీకపూర్‌, చిన్న కూతురు ఖుషీతో కలసి శ్రీదేవి దుబాయ్‌ వెళ్లారు. పెద్ద కూతురు జాహ్నవి షూటింగ్‌ కారణంగా ముంబైలోనే ఉండిపోయారు. శనివారం రాత్రి శ్రీదేవి వేడుకల్లో హుషారుగానే పాల్గొన్నారు. కొందరు బంధువులు తిరిగి స్వదేశం చేరుకున్నా ఆమె అక్కడే ఆగిపోయారు. జుమైరా ఎమిరేట్స్‌ టవర్‌ హోటల్‌లోని తన స్నానాల గదిలో రాత్రి 11 గంటల సమయంలో ఆమె కుప్పకూలింది.
 • శ్రీదేవికి భర్త బోనీకపూర్‌, ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, ఖుషీ ఉన్నారు.
 • తమిళనాడులోని శివకాశిలో 1963 ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి(అసలు పేరు అమ్మయంగార్‌ అయ్యప్పన్‌) నాలుగేళ్ల వయసు నుంచే వెండితెరపై వెలిగారు.
 • 1967లో ‘కందన్‌ కరుణై’ చిత్రంలో బాలనటిగా రంగప్రవేశం చేశారు.
 • ఎన్టీఆర్‌, శివాజీ గణేశన్‌, ఎస్వీఆర్‌ వంటి హేమాహేమీల నడుమ, గంభీరమైన రూపు వాచకం ఉన్న అంత పెద్ద నటుల మధ్య ఏమాత్రం తొట్రుపడకుండా అలవోకగా శ్రీదేవి నటించారు. ‘బడిపంతులు’లో ‘బూచాడమ్మ బూచాడు’ పాటతో తెలుగు ప్రేక్షకులు ముచ్చటపడే చిన్నారిగా మారారు.
 • 11వ ఏటనే మలయాళంలో హీరోయిన్‌గా నటించినా 13వ ఏట తెలుగులో ‘అనురాగాలు’ (1976), 14వ ఏట ‘మా బంగారక్క’ (1977) సినిమాతో తెలుగు హీరోయిన్‌గా మారారు.
 • ‘పదహారేళ్ల వయసు’ (1978) ఘన విజయంతో ఆమె దశ తిరిగింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు ఇటు దక్షిణాదిని, అటు ఉత్తరాదిని ఏలారు. ‘ప్రేమాభిషేకం’, ‘వేటగాడు’, ‘కొండవీటి సింహం’, ‘దేవత’ వంటి సూపర్‌ హిట్స్‌ ఆమె ఖాతాలో ఉన్నాయి.
 • నాగార్జునతో ‘ఆఖరి పోరాటం’, చిరంజీవితో ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ వంటి భారీ హిట్స్‌ ఇచ్చారు. హిందీలో ‘సద్మా’, ‘చాందినీ’, ‘చాల్‌బాజ్‌’, ‘ఖుదాగవా’ వంటి సినిమాలు ఆమె వల్లే హిట్‌ అయ్యాయి.
 • 2013లో శ్రీదేవి ‘పద్మశ్రీ’ అందుకున్నారు.  
 • శ్రీదేవి తండ్రి అయ్యప్పన్‌ శివకాశిలో స్థిరపడ్డ తెలుగు వ్యక్తి. ఆయన తెలుగు స్పష్టంగా మాట్లాడేవారు.
 • తల్లి రాజేశ్వరి చిత్తూరు జిల్లా నుంచి సినీ రంగ అవకాశాలను వెతుక్కుంటూ చెన్నై వెళ్లారు.
 • శ్రీదేవికి శ్రీలత అనే సోదరి ఉంది. నటి మహేశ్వరి కజిన్‌. బోనీ కపూర్‌ను వివాహమాడారు. నటుడు అనిల్‌కపూర్‌ శ్రీదేవికి మరిది.
 • శ్రీదేవి చివరి సినిమా ‘మామ్‌’ (2017).
 • పదిహేనేళ్లపాటు చిత్రాలకు విరామం ఇచ్చిన అనంతరం ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు.
 • కుమార్తె జాహ్నవి నటిస్తున్న తొలి చిత్రం ‘ధడక్‌’ ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. కుమార్తెను హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి ఎంతో పరితపించారు. ఆ సినిమా విడుదల కాకముందే ఆమె మరణించారు. 

views: 943

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams