Current Affairs Telugu Daily

కథా రచయిత మునిపల్లె రాజు మృతి
అభ్యదయవాది, తాత్వికుడైన ప్రముఖ కథారచయిత మునిపల్లె రాజు(93) 2018 ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో మృతి చెందారు. మునిపల్లె రాజు 1943 నుంచి 1983 వరకు రక్షణ శాఖలో పని చేశారు. సోషల్‌ రియాలిటీ, సోషల్‌ ఫిలాసఫీ.. మానవ జీవితాలను శాసించే సూత్రాల వరకు అన్ని ప్రక్రియలను ఆయన రచించిన కథల్లో ప్రతిభావంతంగా ప్రయోగించి మెప్పించి గొప్ప కథారచయితగా ఎదిగారు. సాహితీ కృషి గుర్తింపుగా నూతపాటి గంగాధరం సాహితీ సత్కారం, జ్యేష్ట లిటరరీ ట్రస్టు పురస్కారంతో పాటు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం ఆయనను వరించాయి.
views: 1021

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams