Current Affairs Telugu Daily

రసగుల్లా భౌగోళిక గుర్తింపునకు ఒడిశా తాజా దరఖాస్తు 
ఇంటర్నెట్‌లో రసగుల్లా అని టైప్‌ చేయగానే మా రాష్ట్రమే కనపడాని పశ్చిమ్‌బంగ, ఒడిశాలు ఎప్పట్నుంచో పోటీ పడుతున్నాయి. పశ్చిమ్‌బంగ 2017 నవంబరులోనే ఈ గుర్తింపును సాధించగా, ఒడిశా తాజాగా దరఖాస్తు పెట్టుకుంది.
  • చెన్నైలోని భౌగోలిక గుర్తింపు (జీఐ) సంస్థ నుంచి ‘బంగలార్‌ రసగుల్లా’ పేరున పశ్చిమబంగ 2017 నవంబరులోనే గుర్తింపు పొందింది.
  • దీంతో ఒడిశా ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. విషయం ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వరకూ వెళ్లింది. ఒడిశా రసగుల్లాకు జీఐ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
  • ‘ఒడిశారా రసగుల్లా’ పేరున సంబంధిత అధీకృత సంస్థకు దరఖాస్తు చేసినట్టు పరిశ్రమశాఖ అధికారులు తెలిపారు.
  • ఒడిశాలో ప్రసిద్ధిగాంచిన జగన్నాథస్వామికి భక్తులు రసగుల్లాను అర్పించడం 12వ శతాబ్దం నుంచే ఆనవాయితీగా వస్తోంది.
  • ‘దండి రామాయణం’ అనే 16వ శతాబ్దంనాటి పురాణకావ్యంలోనూ రసగుల్లా ప్రస్తావన ఉంది. ఈ వివరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం జీఐ దరఖాస్తులో పేర్కొంది.

views: 1039

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams