Current Affairs Telugu Daily

తెలంగాణ గృహనిర్మాణ సంస్థకు ‘హడ్కో డిజైన్‌ అవార్డు-2017’
రాష్ట్రంలో రెండు పడక గదుల గృహాల ఆకృతి, విపత్తులను ఎదుర్కొనేలా ఇళ్లను నిర్మిస్తున్నందున తెలంగాణ గృహనిర్మాణ సంస్థకు ‘హడ్కో డిజైన్‌ అవార్డు -2017’ లభించింది. పట్టణ, గ్రామీణ పేదలకు ప్రభుత్వమే పూర్తి ఖర్చుతో గృహాలు నిర్మిస్తున్నందున అభినందించింది.  
  • ఏప్రిల్‌ చివరి వారంలో డిల్లీలో జరిగే హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అవార్డు ప్రదానం చేయనుంది.
  • సిరిసిల్ల, గజ్వేల్‌, సిద్దిపేట, ఖమ్మం, సూర్యాపేటలో రెండు పడక గదుల గృహాలను హడ్కో ప్రతినిధి బృందం పరిశీలించి అవార్డుకు ఎంపిక చేసింది. 
  • తెలంగాణ గృహనిర్మాణ శాఖ మంత్రి - ఇంద్రకరణ్‌రెడ్డి
  • తెలంగాణ గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌ - మడుపు భూంరెడ్డి 

views: 1152

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams