Current Affairs Telugu Daily

భూ ప్రక్షాళనకు ప్రోత్సాహకంగా రెవెన్యూ ఉద్యోగులకు నెల వేతనం 
అత్యంత క్లిష్టమైన భూ రికార్డు ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 ఫిబ్రవరి 24న నిర్ణయించారు. 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది వీఆర్‌ఏలు, 530 మంది సర్వే విభాగం ఉద్యోగులు కలిపి మొత్తం 35,749 మంది ఉద్యోగులకు ఒక నెల మూలవేతనం అదనంగా అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
  • దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో కేవలం 100 రోజుల వ్యవధిలోనే రెవెన్యూ ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేసి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారని సీఎం అభివర్ణించారు. 

views: 1038

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams