Current Affairs Telugu Daily

బయో ఆసియా సదస్సు ముగింపు
హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో 2018 ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు బయో ఆసియా సదస్సును నిర్వహించారు. బయోఆసియా-2018 సదస్సు చివరి రోజైన 2018 ఫిబ్రవరి 24న కేటీఆర్‌-సురేష్‌ప్రభు జుగల్‌బందీ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖ మంత్రి సురేష్‌ ప్రభు హాజరై మాట్లాడారు. ఫార్మా పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
  • చివరి రోజు స్టార్టప్‌ పోటీలు నిర్వహించారు. మొత్తం 200 వరకు దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నుంచి 30 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. వేదికపై ఆయా సంస్థల ప్రతినిధులు తమ ఉత్పత్తులు, ఆలోచనలను వివరించారు. వాటి ఆధారంగా ఏటీజీసీ బయోటెక్‌, నెక్ట్‌ బిగ్‌ ఇన్నొవేషన్‌ ల్యాబ్స్‌, టెస్ట్‌రైట్‌, పెరిగ్రిన్‌ ఇన్నొవేషన్స్‌, డాక్టర్నల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ట్రూకేర్‌ సంస్థలకు పురస్కారాలు అందజేశారు. 

views: 1258

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams