Current Affairs Telugu Daily

కాకినాడకు వచ్చిన అరుదైన చైనా పక్షి జాతి గ్రేట్‌నాట్‌ 
అంతరించిపోయే జాబితాలో ఉన్న గ్రేట్‌నాట్‌ అనే అరుదైన పక్షి జాతి గుంపును ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో గుర్తించారు. కుంభాభిషేకం చేపల రేవు వద్ద చిత్తడి నేలలో ఇటీవల ఇవి కనిపించినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇగ్రీ ఫౌండేషన్‌, వన్యప్రాణి అధికారులు తెలిపారు. ఈ జాతి పక్షులు చైనా నుంచి 4,303 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేసి ఇక్కడకు వచ్చాయన్నారు. ఇటీవల పక్షుల గణన సమయంలో తీసిన ఛాయాచిత్రంలో ఒక పక్షి కాలికి తగిలించి ఉన్న రింగు, నలుపు తెలుపు జెండా ఆధారంగా అది చైనా నుంచి వచ్చినట్లు గుర్తించామన్నారు. ఆ ఛాయా చిత్రాలను చైనా షాంఘైలోని సంబంధిత విభాగానికి పంపగా.. ‘ఆ పక్షలు తమ దేశం నుంచి వలస వచ్చాయని.. ఇక్కడ అంతరించిపోతున్న పక్షి జాతులు ఎక్కడకు వలుస వెలుతున్నాయో తెలుసుకునేందుకే ఇలా జెండా, రింగ్‌ అమర్చామని, ఈ పక్షులు సుమారు 460కు పైగా ఉన్నాయని చైనా అధికారులు తెలిపినట్లు వన్యప్రాణి అధికారులు తెలిపారు. చైనాలో చిత్తడి నేలలు మంచుతో కప్పబడి ఉండటంతో ఆహారం కోసం కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ పక్షి జాతి కాకినాడకు వచ్చిందన్నారు.
views: 1061

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams