Current Affairs Telugu Daily

తాపి పైప్‌లైన్‌ నిర్మాణంలో అఫ్గాన్‌ సెక్షన్‌ పనులు ప్రారంభం
తుర్కమెనిస్థాన్‌ నుంచి అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, భారత్‌(తాపి)కు గ్యాస్‌ను సరఫరాచేసే అతిపెద్ద పైప్‌లైన్‌ నిర్మాణంలో భాగమైన అఫ్గాన్‌ సెక్షన్‌ పనులు 2018 ఫిబ్రవరి 23న ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో అఫ్గాన్‌ అధ్యక్షుడు అస్రాఫ్‌ ఘనీ, తుర్క్‌మెనిస్థాన్‌ అధ్యక్షుడు గర్బంగులి బెర్దీముఖమెదోవ్‌, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షాహిద్‌ కె.అబ్బాసీ, భారత విదేశాంగశాఖ సహాయమంత్రి ఎం.జె.అక్బర్‌ హాజరయ్యారు. అఫ్గాన్‌-తుర్క్‌మెనిస్థాన్‌ సరిహద్దులోని సెర్కెతాబాత్‌లో ఈ కార్యక్రమం జరిగింది. తుర్క్‌మెనిస్థాన్‌ సెక్షన్‌లో ఇప్పటికే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.
  • గతంలో బ్రిటీష్‌ సర్కారు మూసేసిన చరిత్రాత్మక దక్షిణాసియా, మధ్యఆసియా మార్గం తిరిగి అనుసంధానమవుతుంది.
  • ఈ ప్రాజెక్టులో భాగస్వామి అవుతామని 2008 ఏప్రిల్‌లోనే భారత్‌ ప్రకటించింది. తదుపరి సమావేశాల్లో చురుగ్గా పాల్గొంది. అయితే పైప్‌లైన్‌ను పేల్చేస్తామని అప్పట్లో తాలిబాన్లు హెచ్చరించడంతో కొద్దిరోజులు పునరాలోచనలో పడింది. ఇప్పుడు తాలిబాన్లు మద్దతు ఇస్తుండడంతో భారత్‌ కూడా ముందుకు వెళుతోంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం నాలుగు దేశాలు కలిసి ఏర్పాటుచేస్తున్న కంపెనీలో గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(గెయిల్‌) భాగస్వామి అవుతోంది.
  • తాలిబాన్లకు మంచి పట్టున్న అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌, పాకిస్థాన్‌లోని క్వెట్టా గుండా ఈ పైప్‌లైన్‌ వెళుతుంది. వారి మద్దతుంటే తప్ప ఈ ప్రాజెక్టు అమలు సాధ్యంకాదు. మొదట్లో బెట్టుచేసిన తాలిబాన్లు ఇప్పుడు పట్టు సడలించారు. తాము ఈ పైప్‌లైన్‌ నిర్మాణానికి హామీ ఇస్తామని, ఇది అఫ్గానిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన ప్రాజెక్టు అని తాలిబాన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ ప్రకటించారు. 
  • గ్యాస్‌ ధరకు సంబంధించి ఇప్పటికీ భారత్‌, పాకిస్థాన్‌కు ఆందోళనలున్నాయి. తుర్క్‌మెనిస్థాన్‌ చెప్పిన ధరపై భారత్‌ సంతృప్తిగా లేదు. పునఃచర్చలు జరుగుతున్నాయి.
TAPI-Turkmenistan–Afghanistan–Pakistan–India Pipeline

views: 877

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams