Current Affairs Telugu Daily

కంపెనీగా తెలంగాణ రైతు సమితి సంస్థ 
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి సంస్థను కంపెనీ చట్టం కింద నమోదుకు కంపెనీ సెక్రటరీని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ వ్యవసాయశాఖ 2018 ఫిబ్రవరి 23న ఉత్తర్వులు జారీచేసింది. కంపెనీ చట్టం కింద నమోదుకు కావాల్సిన ప్రక్రియనంతా శరవేగంగా పూర్తిచేయాలని ఈ అధికారికి సూచించింది. మద్దతు ధరకు పంట కొనుగోలు చేయడానికే రాష్ట్ర రైతు సమన్వయ సమితి సంస్థ పనిచేస్తుందని మొదట చెప్పినప్పటికీ ఇప్పుడు వాటి పనితీరును విస్తృతపరుస్తూ వ్యవసాయశాఖ ఆదేశాలిచ్చింది.
  • పంటల సాగును రైతు ఇష్టమైనట్లు కాకుండా వాతావరణం, భూముల రకాలు, స్థానిక మార్కెట్‌ అవసరాల ప్రకారం ఏయే ప్రాంతాల్లో ఏపంటను ఒకేచోట వేయాలనేది సమితులు నిర్ణయిస్తాయి. దీన్ని ‘పంట కాలనీ’ విధానం అంటారు. దీనికి రూ.200 కోట్ల మూలధనం ఏర్పాటుచేశారు.
  • భవిష్యత్తులో పంట కొనుగోలు అవసరమైన నిధుల బ్యాంకు నుంచి అప్పుగా తీసుకోవడానికి సంస్థను ఉపయోగిస్తారు.
  • ఏప్రిల్‌ 15 నుంచి ఎకరానికి రూ.4 వేల చొప్పున చెక్‌ను రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఈ సంస్థ ద్వారానే చెక్‌ పంపిణీ జరగనుంది.

views: 1037

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams