Current Affairs Telugu Daily

మార్చి 1-10 వరకూ ఎన్నికల బాండ్ల విక్రయం
తొలివిడతగా ఎన్నికల బాండ్లను 2018 మార్చి 1-10 వరకూ విక్రయించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. భారతీయ స్టేట్‌ బ్యాంకు(SBI)కి చెందిన అథీకృత శాఖల్లో వీటి అమ్మకాలు జరుగుతాయని వివరించింది.
  • భారత్‌లో పౌరుడిగా ఉన్న ఒక వ్యక్తి లేదా ఏర్పాటైన సంస్థ ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.
  • ఒక వ్యక్తి విడిగా కానీ ఇతరులతో కలసి ఉమ్మడిగా కానీ వీటిని కొనుగోలు చేయవచ్చు.
  • గత లోక్‌సభ లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక శాతానికి తక్కువ కాకుండా ఓట్లు సాధించిన రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ బాండ్లను అందుకోవడానికి అర్హత ఉంటుంది.
  • అథీకృత బ్యాంకుల ఖాతాల ద్వారా మాత్రమే సదరు పార్టీ ఈ బాండును నగదుగా మార్చుకోవాలి.
SBI-State Bank of  India

views: 870



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams