Current Affairs Telugu Daily

తెలంగాణలో 4 ఐలాలు ఏర్పాటు
తెలంగాణలో కొత్తగా 4 పారిశ్రామిక పార్కులను పారిశ్రామిక ప్రాంత స్థానిక ప్రాధికార సంస్థలు(ఐలా)గా ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఫిబ్రవరి 21న ఉత్తర్వులు  జారీ చేసింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌, కుత్బుల్లాపూర్‌, ఇబ్రహీంపట్నంతో పాటు వరంగల్‌ పారిశ్రామిక పార్కుకు ఈ హోదా కల్పించింది. దీంతోపాటు నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలీలోని ఐటీ పార్కుకు సైతం టౌన్‌షిప్‌ హోదా కల్పించింది.
  • ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఈ ప్రాంతాలు నగర పాలక సంస్థ పరిధి నుంచి మినహాయింపు పొందుతాయి.
  • ఐలాలే వాటి పరిపాలనను నిర్వహిస్తాయి. రోడ్లు, మంచినీటి వసతి, మురుగునీటి పారుదల సౌకర్యాలు కల్పిస్తాయి.
  • పన్నులను అవే వసూలు చేస్తాయి. ఇందులో 35 శాతాన్ని స్థానిక సంస్థలకు చెల్లించి, మిగిలిన 65 శాతంతో అభివృద్ధి పనులు నిర్వహిస్తాయి.
  • మాదాపూర్‌ ఐలా పరిధిలో నాలెడ్జ్‌ నగరం, రాయదుర్గం, మియాపూర్‌లు ఉంటాయి.
  • కుత్బుల్లాపూర్‌ పరిధిలో గాజులరామారం
  • ఇబ్రహీంపట్నం పరిధిలో కొంగరకలాన్‌, కంపోజిట్‌ తయారీ సమూహం ఉంటాయి.
  • వరంగల్‌ ఐలా పరిధిలో ఐటీపార్కు, మడికొండ జౌళి పార్కు, కాకతీయ జౌళి పార్కు ఉంటాయి.
IALA-Industrial Area Local Authority 

views: 1112



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams