Current Affairs Telugu Daily

నవాజ్‌ షరీఫ్‌ రాజకీయ పార్టీకి కూడా సారధిగా కొనసాగరాదు : పాక్‌ సుప్రీంకోర్టు
పనామా పత్రాల వ్యవహారంతో పదవీచ్యుతుడైన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ రాజకీయ కెరీర్‌కు మరోగట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాక్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 62, 63 కింద అనర్హుడైన వ్యక్తి ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీకి కూడా సారధిగా కొనసాగరాదంటూ సుప్రీంకోర్టు 2018 ఫిబ్రవరి 21న పేర్కొంది.
  • సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మూలంగా ఓ రాజకీయ పార్టీగా పీఎంఎల్‌-ఎన్‌ రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
  • ప్రధాన న్యాయమూర్తి సాకిబ్‌ నిసార్‌ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెబుతూ పార్లమెంటు కార్యకలాపాలను నిర్వహించాల్సిన వ్యక్తి నిష్కళంకుడై ఉండటం అవసరమని పేర్కొంది.
  • ఆర్టికల్‌ 62, 63 కింద అనర్హులైన వారు నేషనల్‌ అసెంబ్లీ లేదా సెనేట్‌కు ఎవరి అభ్యర్ధిత్వాలనైనా ప్రతిపాదించడానికి వీలు పడదని స్పష్టం చేసింది. 

views: 911

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams