Current Affairs Telugu Daily

కమల్‌హాసన్‌ మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ ప్రారంభం
విశ్వనటుడు కమల్‌హాసన్‌ తమిళనాడులోని మదురై జిల్లా వేదికగా 2018 ఫిబ్రవరి 21న ‘మక్కల్‌ నీది మయ్యమ్‌’ పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించారు. పతాకాన్నీ ఆవిష్కరించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో హాజరైన అశేష జనసందోహం మధ్య ఈ కార్యక్రమం జరిగింది. కమల్‌తో పాటు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ తమిళనాడు ఇన్‌ఛార్జి సోమనాథ్‌భారతి, రైతుసంఘం నేత పీఆర్‌ పాండియన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • ప్రజా న్యాయ కేంద్రం అనే అర్థమొచ్చేలా ‘మక్కల్‌ నీది మయ్యమ్‌’గా పార్టీ పేరును ప్రకటించారు.
  • తమ పార్టీ జెండాలోని ఆరు చేతులు ఆరు రాష్ట్రాలను, మధ్యలోని నక్షత్రం ప్రజలను సూచిస్తాయని తెలిపారు.
  •  రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఇంటిని సందర్శించి కమల్‌ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 

views: 1126

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams