Current Affairs Telugu Daily

NCL శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీనివాసరెడ్డికి సన్‌ ఫార్మా అవార్డు 
ఫార్మా రంగంలో అత్యుత్తమ పరిశోధనలు చేసినందుకు పుణెలోని నేషనల్‌ కెమికల్‌ ల్యాబొరేటరీకి(NCL) చెందిన డాక్టర్‌ శ్రీనివాసరెడ్డికి సన్‌ ఫార్మా అవార్డు లభించింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం సమీపంలోని శోభనాద్రిపురానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పదార్థాల ద్వారా ఫార్మా ఉత్పత్తులను రూపొందించేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ఈ అంశంపై ఆయన రాసిన పరిశోధన పత్రాలు అనేక అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఇందులోభాగంగా ఇటీవల ఆయన రూపొందించిన మూడు ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి పేరొచ్చింది.
  • సీసీఎంబీకి చెందిన రాజన్‌ శంకరనారాయణన్‌(మౌలిక పరిశోధనలు), వెల్లూరులోని సీఎంసీ ఆస్పత్రికి చెందిన విక్రమ్‌ మేథ్యు(వైద్య పరిశోధనలు), డిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ఆయిష్‌ సూరి(క్లినికల్‌ రీసెర్చ్‌)కు కూడా అవార్డులు  లభించాయి. 
NCL-National Chemical Laboratory

views: 1043

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams