Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో డేటా సైన్స్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రం 
డేటా సైన్స్‌, కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌లెన్స్‌ కేంద్రాన్ని (సీఓఈ) ఏర్పాటు చేస్తోంది. ఇందుకు నాస్‌కామ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
  • ప్రారంభంలో ఈ కేంద్రాన్ని ట్రిపుల్‌ ఐటీలో ప్రారంభిస్తారు. అనంతరం హైదరాబాద్‌ సమీపంలోని బుద్వేల్‌ వద్ద అభివృద్ధి చేస్తున్న డేటా అనలిటిక్స్‌ పార్కులోకి తరలిస్తారు.
  • అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి వ్యవస్థ (ఎకో సిస్టమ్‌) అభివృద్ధిని కొనసాగించడానికి, బిగ్‌ డేటా, కృత్రిమ మేధ రంగాల్లో పటిష్టమైన పరిశోధన, వినూత్న సొల్యూషన్ల అభివృద్ధికి ఈ కేంద్రం దోహదం చేస్తుంది.
  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో దాదాపు రూ.40 కోట్ల పెట్టుబడితో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రంగంలోని భాగస్వాముల  మధ్య సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చిపుచ్చుకోవడానికి ఇది ఒక వేదికగా పని చేస్తుంది. 
  • నాస్‌కామ్‌ ప్రెసిడెంట్‌ : చంద్రశేఖర్‌ 
NASSCOM -National Association of Software and Services Companies

views: 1072Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams