Current Affairs Telugu Daily

తెలంగాణలో 71 ఏళ్లకు పెరిగిన సగటు ఆయుప్రమాణం 
తెలంగాణలో స్త్రీ, పురుషుల  జీవితకాలంలో అనూహ్యమైన పెరుగుదల నమోదయింది. 1990 వరకు 61 సంవత్సరాలు  జీవిస్తేనే గొప్ప అనుకునే పరిస్థితుల నుంచి 2016లో 71.3 ఏళ్లకు సగటు ఆయుప్రమాణం పెరిగినట్లు గుర్తించారు.
  • భారతీయ వైద్య పరిశోధన మండలి, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆరోగ్య సూచికలు-గణాంకాల  సంస్థ సంయుక్తంగా చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు  వెలుగు చూశాయి.
  • పెరుగుతున్న వ్యాధులు, వాటి తీవ్రతతో పలు  వయసుల్లో సంభవిస్తున్న మరణాలు, అందుకు కారణాలను ఆయా సంస్థలు  గణాంకాల్లో తెలిపాయి.  
  • 26 ఏళ్ల కాలాన్ని తీసుకుని లెక్కలు  వేశాయి. 
  • స్త్రీ కన్నా పురుషులే జీవిత మజిలీని త్వరగా పూర్తి చేస్తున్నారు.
  • పురుషులు  69.4 ఏళ్లు జీవిస్తుంటే స్త్రీలు  73.2 ఏళ్లు జీవిస్తున్నట్లు తేలింది. అంటే స్త్రీలు సగటున 3.8 ఏళ్లు ఎక్కువగానే జీవిస్తున్నారు.
  • 1990ల్లో మాత్రం స్త్రీ, పురుషుల  మధ్య 1.6 ఏళ్ల కాలం తేడా ఉండేది. స్త్రీలకు 61.8 ఏళ్లు ఆయురార్ధం ఉండగా, పురుషులకు 60.2 ఏళ్లు మాత్రమే ఉన్నట్లు తేలింది.
  • 26 ఏళ్ల కాలంలో ఆయు ప్రమాణం స్త్రీలకు 11.4 ఏళ్లకు, పురుషులకు 9.2ఏళ్లకు పెరిగింది.

views: 1017

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams