Current Affairs Telugu Daily

ముంబైలో రెండో విమానాశ్రయంకు శంకుస్థాపన
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2వ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి 2018 ఫిబ్రవరి 18న శంకుస్థాపన చేశారు. అలాగే దేశంలోనే అతిపెద్ద నౌకాశ్రయమైన జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌ (జేఎన్‌పీటీ)లోని 4వ టర్మినల్‌లో మొదటి దశను మోడి ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు.
  • ప్రస్తుతం దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన (ఒకటే రన్‌వే ఉన్న వాటిలో) ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంపై భారాన్ని తగ్గించేందుకు ఈ కొత్త విమానాశ్రయాన్ని అందుబాటులోకి తేనున్నారు.
  • మహారాష్ట్ర ముఖ్యమంత్రి : దేవేంద్ర ఫడ్నవీస్‌
  • మహారాష్ట్ర గవర్నర్‌ : సీహెచ్‌ విద్యాసాగర్‌రావు

views: 952

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams