Current Affairs Telugu Daily

సీడబ్ల్యూసీని రద్దు చేసిన రాహుల్‌
కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం ‘‘కేంద్ర కార్యనిర్వాహక సంఘం (సీడబ్ల్యూసీ)’ను ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ 2018ఫిబ్రవరి 16న రద్దు చేశారు. దీని స్థానంలో 34 మందితో ‘స్టీరింగ్‌ కమిటీ’ని ఏర్పాటుచేసిబ,  త్వరలో నిర్వహించే ప్లీనరీ బాధ్యతలను దీనికి అప్పగించారు. సీడబ్ల్యూసీ సభ్యుందర్నీ రాహుల్‌గాంధీ కొత్త కమిటీలో భాగస్వాములను చేశారు. అమరీందర్‌ సింగ్‌, ఆర్కే ధావన్‌, శివాజీరావ్‌ దేశ్‌ముఖ్‌ వంటి శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులను తొలగించారు.  ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక్క నాయకుడికి కూడా చోటు కల్పించలేదు.
views: 1030

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams