Current Affairs Telugu Daily

తత్కాల్‌ టికెట్లపై 100 శాతం రీఫండ్‌
తత్కాల్‌ కింద బుక్‌ చేసుకున్న టికెట్లపై 100 శాతం రీఫండ్‌ను అందించనున్నట్లు రైల్వేశాఖ 2018 ఫిబ్రవరి 15న వెల్లడించింది. ఈ-టికెట్లతో పాటు కౌంటర్‌లో
తీసుకున్న టికెట్లకు కూడా రీఫండ్‌ వర్తిస్తుందని రైల్వేశాఖ పేర్కొంది. కింద పేర్కొన్న 5 సందర్భాల్లో టికెట్‌ ధర మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తామంది.
1. ఒకవేళ రైలు రాక 3 గంటలు అంతకన్నా ఎక్కువ ఆలస్యమైనప్పుడు.
2. రైలును దారి మళ్లించినప్పుడు. 
3. రైలును దారి మళ్లించిన తర్వాత ప్రయాణికులు ట్రైన్‌ ఎక్కాల్సిన స్టేషన్‌ లేదా దిగాల్సిన స్టేషన్‌ లేదా రెండూ కొత్త మార్గంలో లేకపోతే.
4. ప్రయాణికులు ఎక్కాల్సిన కోచ్‌ను  రైలుకు అనుసంధానించకపోతే, అధికారులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయం కల్పించనప్పుడు.
5.  రైలులో రిజర్వేషన్‌ చేసుకున్నదానికి బదులుగా లోయర్‌ క్లాస్‌లో ప్రయాణించేందుకు ప్రజులు ఇష్టపడకపోతే (ఒకవేళ ప్రయాణికులు ఇందుకు అంగీకరిస్తే రెండు
టికెట్లకు మధ్య ఉన్న తేడాను రైల్వేశాఖ ఆ ప్రయాణికుడికి చెల్లిస్తుంది). 

views: 1159



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams