Current Affairs Telugu Daily

‘లెయిడ్‌ టు రెస్ట్‌’ పుస్తక ఆవిష్కరణ
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ప్రాణాలను బలితీసుకున్నది విమాన ప్రమాదమేనని ఆయన మేనల్లుడు ఆశిష్‌ రే స్పష్టం చేశారు. 11 వేర్వేరు దర్యాప్తు వివరాలను క్రోడీకరించి ‘లెయిడ్‌ టు రెస్ట్‌’ అనే పుస్తకాన్ని ఆయన వెలువరించారు. నేతాజీ మరణానికి సంబంధించి కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించేందుకు అందులో యత్నించారు.
  • 1945 ఆగస్టు 18న తైపీలో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో బోస్‌ మృత్యువాతపడ్డారని తెలిపారు. నాడు నేతాజీ జపాన్‌ వైమానికదళ విమానంలో ప్రయాణించారని, విమానంలో కొన్ని లోపాలుండటంతో తైపీ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయిందని వెల్లడించారు.
  • ప్రమాదం అనంతరం కొన్ని గంటలపాటు నేతాజీ ప్రాణాలతో ఉన్నారని, అదే రోజు సాయంత్రం నన్మాన్‌ సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని వివరించారు.
  • నాడు విమానంలో నేతాజీతోపాటు మరో 12 మంది ఉన్నారని, వారిలో ఆరుగురు మృతి చెందారని తెలిపారు. మిగిలిన ఆరుగురు ప్రమాదానికి సంబంధించి వాంగ్మూలాలు ఇచ్చారని, వాటిని ఏమాత్రం తోసిపుచ్చలేమని  తెలిపారు.
  • భారతీయ(4 దర్యాప్తు), జపాన్‌(3), బ్రిటన్‌(3), తైవాన్‌(1) దర్యాప్తు వివరాలను పుస్తకంలో ఆశిష్‌ వెల్లడించారు.

views: 1249

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams