Current Affairs Telugu Daily

దేశంలో 12% పెరిగిన సంపన్నుల సంఖ్య : కోటక్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక
దేశంలో సంపన్ను సంఖ్య 12 శాతం పెరిగినా, అందరి సంపద వృద్ధి 5 శాతమేనని కోటక్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక వెల్లడించింది. సంపద పంపిణీ సక్రమంగా జరగడం లేదని, సమాజంలో పేద-ధనిక తారతమ్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, 2017లో ప్రపంచ, దేశ పరిస్థితుపై కోటక్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక రూపొందించింది. 
ఈ నివేదిక ప్రకారం.. 
  • దేశీయంగా రూ.25 కోట్లు అంతకుమించి నికర విలువ కలిగిన సంపన్నుల  సంఖ్య 2017లో 1.60 లక్షలకు చేరింది. 2016 కంటే వీరి సంఖ్య 12 శాతం పెరిగింది. ఇదే సమయంలో అందరి సంపద 5 శాతమే వృద్ధి చెంది రూ.153 లక్షల కోట్లకు చేరింది. 
  • రాబోయే 5 సం॥లో అత్యంత సంపన్నుల సంఖ్య రెట్టింపై 3.30 లక్షలకు చేరుతుంది. వీరి నికర సంపద విలువ కూడా రూ.352 లక్షల కోట్లకు చేరుతుంది. చిన్న పట్టణాల నుంచే కుబేరు సంఖ్య పెరుగుతోంది. ఇది కొనసాగనుంది. 
  • జీడీపీ వృద్ధికి తోడు, పొదుపు, మ్యూచువల్‌ ఫండ్లు, స్థిరాస్తి, బంగారం, షేర్లలో మదుపును, బ్యాంకు డిపాజిట్లలో వృద్ధిని కూడా నివేదిక రూపొందించేందుకు పరిగణనలోకి తీసుకున్నారు. అవకాశాలకు అనుగుణంగానే వీరు పెట్టుబడి పెడుతున్నారని, ఈ ఏడాది వ్యవసాయం-మౌలిక సదుపాయాల కల్పన రంగాలపై దృష్టి సారిస్తారని నివేదిక వెల్లడించింది.

views: 988

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams