Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో ‘ఎల్పీజీ పంచాయత్‌’
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధాన్‌మంత్రి ఉజ్వల్‌ యోజన’తో మహిళా సాధికారత సాకారం కావడానికి మరో ముందడుగు పడినట్లేనని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. న్యూడిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో 2018 ఫిబ్రవరి 13న నిర్వహించిన ‘ఎల్పీజీ పంచాయత్‌’లో 27 రాష్ట్రాల నుంచి వచ్చిన 100 మందికి పైగా పేద మహిళలతో ఆయన మాట్లాడారు. ఇంధన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎల్పీజీ పంచాయత్‌లో 100 మంది ఎల్పీజీ వినియోగదారులు ఉంటారు. ఎల్పీజీ వినియోగం, ప్రయోజనాలు, వాడకంలో జాగ్రత్తలు చర్చిస్తారు. 2019 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా లక్ష పంచాయత్‌లు నిర్వహించాని మంత్రిత్వశాఖ నిర్ణయించింది.
views: 1011

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams