Current Affairs Telugu Daily

అమెరికా మహిళ కంట్లో మూడోజాతి క్రిములను తొలిసారిగా గుర్తించిన శాస్త్రవేత్తలు
పశువుల కళ్లల్లో మాత్రమే పరాన్నజీవిగా బతికే అరుదైన క్రిమి ఒకటి అమెరికా మహిళ కళ్లల్లో  తిష్ట వేసినట్లు వైద్యులు మొదటిసారిగా గుర్తించారు. ఆమె కంటి నుంచి అర అంగుళం పొడవు మించని 14 పురుగులను బయటకు తీశారు. ఉత్తర అమెరికా, దక్షిణ కెనడాలో పశువు కన్నీటిలో బతికే దిలాజియా గులోసా అనే పరాన్నజీవిగా దీన్ని గుర్తించారు. ఈగలు, గబ్బిలాల ద్వారా ఈ పురుగులు సంక్రమిస్తాయి. ఇప్పటివరకు రెండురకాల దిలాజియా జాతులు మాత్రమే మనుషులకు సంక్రమిస్తాయని తెలుసని, తాజా ఉదంతంతో మూడు జాతులు సంక్రమిస్తాయని తెలిసిందని అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం ప్రొఫెసరు రిచర్డ్‌ బ్రాడ్‌బరీ పేర్కొన్నారు. ఒరెగాన్‌కు చెందిన సదరు మహిళ చేపలు పట్టడానికి సమీపంలోని నదికి వెళ్లినప్పుడు ఈగల ద్వారా ఆ పురుగులు కంట్లోకి ప్రవేశించి ఉంటాయన్నారు. మొదట్లో కన్ను మండటం, దురద రావడంతో వైద్యులను సంప్రదించిందన్నారు. ఈ జాతి పురుగును గురించి అధ్యయనం వివరాలు ‘అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ ట్రోపికల్‌ మెడిసిన్‌ అండ్‌ హైజీన్‌’లో ప్రచురితమయ్యాయి.
views: 1048



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams