Current Affairs Telugu Daily

‘డిస్కవరీ జీత్‌’లో బాబా రామ్‌దేవ్‌ చరిత్ర
యోగా గురువుగా ప్రఖ్యాతిగాంచిన బాబా రామ్‌దేవ్‌ జీవిత చరిత్రపై డిస్కవరీ జీత్‌ చానెల్‌ రూపొందించిన ‘స్వామి రామ్‌దేవ్‌: ఏక్‌ సంఘర్ష్‌’ సిరీస్‌ ప్రసారాలు అదే చానెల్‌లో 2018 ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభమయ్యాయి. 2018 ఫిబ్రవరి 10న డిల్లీలో డిస్కవరీ జీత్‌ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌దేవ్‌పై రూపొందించిన 60 నిమిషాల ప్రత్యేక వీడియోను ఆవిష్కరించారు.
  • నిరుపేద రైతు రాంనివాస్‌ యాదవ్‌ కొడు కైన రామ్‌కిషన్‌(బాబా రామ్‌దేవ్‌ అసలు పేరు) 1965లో సొంతూరులో పడిన బాధ గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు. చిన్ననాటి కష్టాలతోపాటు ఆరోగ్య సమస్యతో ఆచార్య బల్‌దేవ్‌ దగ్గర యోగా నేర్చుకుని అంచెలంచెలుగా బాబా రామ్‌దేవ్‌గా ఎదిగిన క్రమాన్ని ‘స్వామి రామ్‌దేవ్‌: ఏక్‌ సంఘర్ష్’ సిరీస్‌లో చూపించనున్నారు. 

views: 1188

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams