Current Affairs Telugu Daily

రాజస్థాన్‌లో రైతులకు రుణమాఫీ 
రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం రైతుల రుణాలను రద్దు చేసింది. భూమిశిస్తు రద్దుతో పాటు వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకు భారీ ప్రోత్సాహకాలనూ వెల్లడించింది. శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ‘రైతు రుణ ఉపశమన కమిషన్‌’ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజే 2018 పిబ్రవరి 12న శాసనసభలో ప్రకటించారు.
ప్రకటనలోని ముఖ్యాంశాలు
 • చిన్న,సన్నకారు రైతుకు రూ.50వేల వరకు రుణాలు రద్దు 
 • సహకార బ్యాంకుల్లో అప్పు తీసుకున్నవారికే వర్తింపు 
 • దీనివల్ల  రాష్ట్ర ఖజానాపై పడనున్న భారం రూ.8వేల కోట్లు 
 • భూమి శిస్తు రద్దు. దీనివల్ల  40 లక్షల నుంచి 50 లక్షల మంది వరకూ రైతులకు లబ్ధి చేకూరనుంది. 
 • ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ‘రైతు రుణ ఉపశమన కమిషన్‌’ శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తుంది. రుణమాఫీకి తాము ఎలా అర్హులమో వ్యవసాయదారుల కమిషన్‌ ముందు నిరూపించుకోవాల్సి ఉంటుంది. 
 • వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, సేవలకు ప్రోత్సాహంగా వాటి నిర్వాహకులకు ఏడాదికి గరిష్టంగా రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ వడ్డీ రాయితీ. 
 • రాజస్థాన్‌కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లోని 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న మహిళలు, దివ్యాంగులు, ఎస్సీఎస్టీలకు వడ్డీ రాయితీ 5శాతం నుంచి 6 శాతానికి పెంపు.
 • రాష్ట్రంలో బాగా వెనుకబడిన ప్రాంతాల్లో తొలిసారిగా రూ.50 కోట్లకు పైగా పెట్టుబడిపెట్టే పారిశ్రామికవేత్తలకు గరిష్టంగా రూ.5 కోట్ల వరకూ మౌలిక వసతులు రాయితీ. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, బయోటెక్నాలజీ, ఐటీ రంగాలో పెట్టుబడుకు ఈ రాయితీ వరిస్తుంది. 
 • రైతుకు రెండు లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరు. 
 • కేంద్ర సహకార బ్యాంకు ద్వారా స్వల్పకాలిక రుణాలు పొందిన రైతులకు వడ్డీ రాయితీ కోసం రూ.384 కోట్ల కేటాయింపు. 
 • రైతు నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసేందుకు రూ.350 కోట్లతో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణం.
 • జైపూర్‌లో ఒంటె పా ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ కేంద్రం నిర్మాణానికి రూ.5 కోట్ల కేటాయింపు. 

views: 1024

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams