Current Affairs Telugu Daily

ప్రపంచవ్యాప్తంగా ధనిక నగరాల్లో ముంబయికి 12వ స్థానం 
ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న నగరాల్లో, దేశ ఆర్థిక రాజధాని ముంబయి చోటు సాధించింది. నగరంలోని మొత్తం సంపద దాదాపు రూ.61.75 లక్షల కోట్లు ఉంటుందని న్యూ వరల్డ్‌ వెల్త్‌ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 15 ధనిక నగరాల్లో ముంబయికి 12వ స్థానం దక్కింది.
  • న్యూయార్క్‌ (రూ.195 లక్షల కోట్లు) తొలి స్థానంలో నిలిచింది.
  • టొరొంటో (రూ.61.36 లక్షల కోట్లు), ఫ్రాంక్‌ఫర్ట్‌ (రూ.59.28 లక్షల కోట్లు), పారిస్‌ (రూ.55.90 లక్షల కోట్లు) నగరాలను తలదన్ని ముంబయి ముందు వరుసలో నిలిచింది.
  • ఈ సర్వేను ప్రైవేటు వ్యక్తుల సంపదను మాత్రమే లెక్కలోకి తీసుకుని చేశారు.
  • కేవలం  ఆ నగరంలో నివసించే వ్యక్తుల ఆస్తులు, నగదు, ఈక్విటీ విలువను లెక్కగట్టి, అందులోంచి అప్పు తీసేసి విలువ గణించారు.
  • బిలియనీర్లు ఎక్కువగా ఉన్న నగరాల్లోనూ తొలి 10 స్థానాల్లో ముంబయి నిలిచింది. ఇక్కడ 28 మంది బిలియనీర్లు ఉన్నట్లు నివేదిక తెలిపింది.  
  • వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముంబయి ఒకటని, రాబోయే పదేళ్లలో ఇక్కడ మరింతగా సంపద పెరుగుతుందని న్యూ వరల్డ్‌ వెల్త్‌ నివేదిక తెలిపింది.

views: 1006

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams