Current Affairs Telugu Daily

అమరావతిలో ‘విటోపియా-2018’ 
అమరావతిలోని ఏపీ విట్‌ విశ్వవిద్యాయం తొలిసారిగా కళాశాల ప్రాంగణంలో ‘విటోపియా-2018’ కార్యక్రమాన్ని 2018 ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు నిర్వహించారు. దీనికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన 40కు పైగా ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి 300 మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. తమలో ఉన్న ప్రతిభ, పాటవాలను ప్రదర్శించారు. ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, టెన్నిస్‌, క్రికెట్‌ వంటి క్రీడలతో పాటు సినీ, శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ఆట, పాట పోటీలు నిర్వహించారు. 
views: 1124



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams