Current Affairs Telugu Daily

నీతిఆయోగ్‌ ఆరోగ్య సూచీలో కేరళకు ప్రథమ స్థానం
దేశంలో ఆరోగ్య రంగంలో కేరళ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది. ఆ తర్వాత స్థానాలను పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌ దక్కించుకున్నాయి.
  • తక్కువ బరువున్న నవజాత శిశువుల సంఖ్యను తగ్గించే విషయంలో తెలంగాణకు మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్‌కు 3వ స్థానం దక్కింది.
  • శిశు జననాలను నమోదు చేయించే విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రథమ ర్యాంకు లభించగా, తెలంగాణ 12వ ర్యాంకు సాధించింది.
  • ఆడ-మగ శిశువు నిష్పత్తి అనే ప్రామాణికంలో తెలుగు రాష్ట్రాలు రెండింటికీ సమానంగా 8వ ర్యాంకు లభించింది.
  • మొత్తంమీద 30 ప్రామాణికాల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో పనితీరును మదింపు చేస్తే ఆంధ్రప్రదేశ్‌ 8వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలో నిలిచాయి.
  • 2014-15 సంవత్సర గణాంకాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆ ఏడాదితో పోలిస్తే 2015-16లో ఆంధ్రప్రదేశ్‌ 2.41 పాయింట్లు, తెలంగాణ 0.45 పాయింట్లు పెంచుకోగలిగాయి.
  • కేరళ 3.45 పాయింట్లను కోల్పోయినా మొదటి స్థానంలోనే నిలిచింది.
  • ఉత్తర్‌ప్రదేశ్‌కు 5.55 పాయింట్లు పెరిగినా 21వ స్థానంలో అట్టడుగున ఉంది.
  • 29 రాష్ట్రాలను, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును నీతిఆయోగ్‌ పరిశీలించి ర్యాంకు కేటాయించింది.
  • పెద్ద రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణను చేర్చగా చిన్న రాష్ట్రాల్లో గోవా, మణిపూర్‌, మేఘాలయ వంటివి ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలది మూడో విభాగం.
  • ‘ఆయుష్మాన్‌’ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యాన్ని సంతరించుకొంది.
  • ఈ ర్యాంకు ఆధారంగానే ‘జాతీయ ఆరోగ్య మిషన్‌’ (ఎన్‌హెచ్‌ఎం) కింద కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు  అందనున్నాయి.
  • ఏడాది వ్యవధిలో ఏపీ ఒకస్థానం పైకి వెళ్లింది. 
  • తెలంగాణతో పాటు 9 రాష్ట్రాలను ‘కార్యసాధక రాష్ట్రాలు’ (ఎఛీవర్స్‌)గా నీతిఆయోగ్‌ వర్గీకరించింది. 
  • 62 పాయింట్లకు పైగా సాధించిన పంజాబ్‌, తమిళనాడు, కేరళను మొదటి విభాగంలో చేర్చి, విజేతలుగా (ఫ్రంట్‌ రన్నర్స్‌)గా చూపించారు. 
  • 48 కంటే తక్కువ పాయింట్లు వచ్చిన యూపీ, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఒడిశా వంటి రాష్ట్రాలను 3వ విభాగంలో ‘ఆశావహ రాష్ట్రాలు’ (ఏస్పిరెంట్స్‌)గా పేర్కొన్నారు. 
పరిగణించిన అంశాలు 
  • నవజాత శిశు మరణాలు, అయిదేళ్లలోపు పిల్లల్లో మరణాల  శాతం, ఆడ-మగశిశువు నిష్పత్తి, వ్యాధి నిరోధక టీకాలు తీసుకుంటున్నవారి సంఖ్య, ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్య, క్షయవ్యాధి తీవ్రత, హెచ్‌ఐవీ కేసు, ప్రసవానికి సగటు ఖర్చు వంటి అంశాలను ప్రామాణికాలుగా పరిగణించారు.
  • ఆరోగ్య విభాగంలో ఖాళీలు, జననాల నమోదు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో 24 గంటల వైద్య సేలు వంటి ఇతర అంశాలనూ విశ్లేషించినట్లు నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ వెల్లడించారు.
  • ‘ఆరోగ్యకర రాష్ట్రాలు... పురోగమన భారత్‌... రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాలు  ర్యాంకు’ పేరుతో 2018 ఫిబ్రవరి 9న డిల్లీలో ఈ నివేదికను అమితాబ్‌ కాంత్‌ విడుదల చేశారు. 

views: 1076

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams