Current Affairs Telugu Daily

చేపను అనుకరించే రోబో అభివృద్ధి 
చేపను అనుకరించే రోబోను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చేపను చూస్తూ దానిలానే ప్రవర్తించడం వీటి ప్రత్యేకత. సముద్రపు జీవుల గురించి మరిన్ని అంశాలు తెలుసుకునేందుకు ఇవి తోడ్పడే అవకాశముంది. సాధారణంగా రోబో కదలికకు అనుగుణంగా చేపలు, ఇతర జీవులు స్పందిస్తుంటాయి. అయితే చేప కదలికకు స్పందించేలా తాజా రోబోను అమెరికాలోని న్యూయార్క్‌ వర్సిటీ నిపుణులు అభివృద్ధి చేశారు. దీనిలో చేప కదలికను గుర్తించే అధునాతన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు. ప్రత్యేకంగా సిద్ధంచేసిన కృత్రిమ జలావరణంలో దీన్ని పరీక్షించారు. దీంతో ఇది జీబ్రాఫిష్‌ను చక్కగా అనుకరించగలిగింది. 
views: 1182

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams