Current Affairs Telugu Daily

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలేదా జియాకు జైలుశిక్ష
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకురాలు ఖలేదా జియా(72)కు 5 సంవత్సరాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. సుమారు 21 మిలియన్‌ టాకా(కోటి 61 లక్షల రూపాయలు)ను తనకు చెందిన జియా ఆర్ఫాన్‌ ఏజ్‌ ట్రస్ట్‌లోకి విదేశీ విరాళాల రూపంలో మళ్లించి అవినీతికి  పాల్పడినందుకు కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న జియా కుమారుడు తారిఖ్‌ రహమాన్‌తో పాటు మరో నలుగురికి కూడా 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. 
views: 987



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams