Current Affairs Telugu Daily

చేనేతలో పుట్టపాకకు జాతీయ పురస్కారాలు 
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన జెల్లా వెంకటేశం చేనేత హస్తకళలో అద్భుతాలు సృష్టించి సంత్‌ కబీర్‌-
  • 2016 పురస్కారానికి ఎంపికయ్యారు. ఇదే గ్రామానికి చెందిన గజం శ్రీనివాస్‌ జాతీయ పురస్కారానికి, చెరుపల్లి భావనారుషి మెరిట్‌ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యారు.
  • నల్గొండ జిల్లా చండూరుకు చెందిన గంజి యాదగిరి జాతీయ పురస్కారానికి, కందగట్ల భావనారుషి, చిలుకూరి శ్రీనివాస్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యారు.
  • ఈమేరకు కేంద్ర చేనేత మంత్రిత్వశాఖ 2018 ఫిబ్రవరి 6న 2016 సంవత్సరానికి పురస్కారాలు జాబితా ప్రకటించింది.
  • జెల్లా వెంకటేశం ‘డబుల్‌ ఇక్కత్‌’ వస్త్రాన్ని తయారుచేసి ప్రతిభ కనబర్చినందుకు సంత్‌ కబీర్‌ అవార్డుకు ఎంపికయ్యారు.
  • గజం శ్రీనివాసు తెలియా రుమాలు చీరు, చెరుపల్లి భావనారుషి నేషనల్‌ కలాన్‌, టైఅండ్‌డై, డబుల్‌ ఇక్కత్‌, రాజస్థాన్‌ వస్త్రాలు తయారుచేశారు.
  • యాదగిరి జాందాని భగవత్‌ సిల్క్‌లో ప్రతిభ కనబర్చినందుకు, కందగట్ల భావనారుషికి డబుల్‌ ఇక్కత్‌లో ప్రకృతి రంగుతో చీరను తయారు చేసినందుకు, చిలుకూరి శ్రీనివాస్‌కు జాందాని, కాటన్‌లో వస్త్రాలు తయారు చేసినందుకు పురస్కారాలు దక్కాయి.

views: 1359

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams