Current Affairs Telugu Daily

తెలంగాణ శాసనసభ, మండలిలకు ప్రొరోగ్‌
  • తెలంగాణ శాసనసభ, శాసనమండలిలకు ప్రొరోగ్‌(విరామం) ప్రకటిస్తూ రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ 2018 ఫిబ్రవరి 6న ఉత్తర్వులు జారీ చేశారు.
  • సభ, మండలి 8వ విడత సమావేశాలు 2017 అక్టోబర్‌ 27 నుంచి నవంబరు 17 వరకు జరిగాయి. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది.
  • నూతన పంచాయతీరాజ్‌ చట్టం, ఇతర అంశాలపై మళ్లీ సమావేశాలను జరపాలని భావించినప్పటికీ బిల్లు సిద్ధం కాకపోవడంతో ప్రభుత్వం ఆ యోచన మానుకుంది.
  • బడ్జెట్‌ సమావేశాల్లోనే పంచాయతీరాజ్‌ బిల్లు ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.
  • ఈ నేపథ్యంలో 8వ విడత శాసనసభ సమావేశాలు ముగిసినట్లుగా విరామం(ప్రొరోగ్‌) ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరవడంతో గవర్నర్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
  • శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలను 2018 మార్చి 12 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

views: 1210

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams