Current Affairs Telugu Daily

అగ్ని-1 పరీక్ష విజయవంతం
అణ్వస్త్ర సామర్థ్యమున్న స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-1ను భారత్‌ 2018 ఫిబ్రవరి 6న విజయవంతంగా పరీక్షించింది.
  • 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రాన్ని ఒడిశా తీరానికి చేరువలోని అబ్దుల్‌ కలాం దీవి నుంచి ప్రయోగించారు.
  • పోరాట సన్నద్ధతను పటిష్టం చేసుకోవడానికి సైన్యంలోని వ్యూహాత్మక దళాల విభాగం ఈ పరీక్షను నిర్వహించింది.
  • అగ్ని-1ను హైదరాబాద్‌లోని అడ్వాన్స్డ్‌ సిస్టమ్స్‌ లేబొరేటరీ(ఏఎస్‌ఎల్‌), రక్షణ పరిశోధన, అభివృద్ధి లేబొరేటరీ(డీఆర్‌డీఎల్‌), రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌(ఆర్‌సీఐ) అభివృద్ధి చేశాయి.
అగ్ని-1 బరువు : 12 టన్నులు 
అగ్ని-1 పొడవు : 15 మీటర్లు 
అగ్ని-1 పేలోడ్‌ సామర్థ్యం : 1000 కిలోలు 
అగ్ని-1 పరిధి : 700 కిలోమీటర్లు

views: 1202

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams