Current Affairs Telugu Daily

ఆధార్‌ కార్డు ల్యామినేషన్‌ వద్దు : UIDAI
ఆధార్‌ కార్డులను ల్యామినేషన్‌ చేయించడం, ప్లాస్టిక్‌ కార్డులపై ముద్రించడానికి దూరంగా ఉండాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రజలకు సూచించింది.
  • ఇలా ముద్రించిన పత్రాలపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ పనిచేయకపోవచ్చని, పైగా వ్యక్తిగత సమాచారం బహిర్గతమయ్యే ప్రమాదముందని పేర్కొంది.
  • ప్రజల నుంచి ఆధార్‌ వివరాలు సేకరించడం శిక్షార్హమైన నేరమని ముద్రణ సంస్థనూ ఉడాయ్‌ హెచ్చరించింది.
  • UIDAI ఇచ్చిన ఆధార్‌ లేఖ లేదా దానిలో కత్తిరించగలిగేలా ఉన్న భాగమూ ఆధార్‌గా సరిపోతుందని పేర్కొంది.
  • ఒకవేళ ఆధార్‌ కార్డు పోగొట్టుకున్నా.. UIDAI వెబ్‌సైట్‌లోఉచితంగా, అధికారికంగా దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది.
  • కాగితంపై నలుపు, తెలుపు రంగుల్లో ముద్రితమై ఉన్న ఆధార్‌ చెల్లుబాటు అవుతుందని తెలిపింది.
  • మొబైల్‌-ఆధార్‌నూ వినియోగించుకోవచ్చని పేర్కొంది. 
UIDAI సీఈఓ : అజయ్‌ భూషణ్‌ 
UIDAI-Unique Identification Authority of India

views: 1193



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams