Current Affairs Telugu Daily

మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు మృతి
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు(71) 2018 ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లో మృతి చెందారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన ముద్దుకృష్ణమనాయుడు ఎన్టీఆర్‌ పిలుపుతో 1983లో రాజకీయ రంగప్రవేశం చేశారు. తాను ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గ అభివృద్ధి సహా జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషిచేశారు. ముద్దుకృష్ణమనాయుడు 1947 జూన్‌ 9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలో జి.రామానాయుడు, రాజమ్మ దంపతులకు జన్మించారు. బీఎస్సీ, ఎంఏతోపాటు న్యాయవాద డిగ్రీ పట్టా పొందారు. ఆయనకు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డుకెక్కారు. విద్య (1984), అటవీశాఖ (1987), ఉన్నత విద్య (1994) మంత్రిగా  సేవందించారు. తెలుగుదేశంతో విభేధించి కాంగ్రెస్‌లో చేరి 2004 ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యునిగా గెలుపొందారు. తిరిగి 2008లో టీడీపీలో చేరి 2009 ఎన్నికల్లో పుత్తూరు నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా సేవందిస్తున్నారు. 
views: 1003

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams